తమన్నాను అందుకే తప్పించాం!

Why Tamannah was removed from Savyasachi
Tuesday, October 30, 2018 - 20:15

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా రాబోతున్న "సవ్యసాచి" సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. "నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయితు" అనే సూపర్ హిట్ పాటను ఇందులో రీమిక్స్ చేశారు. ఈ పాట కోసం ప్రత్యేకంగా తమన్నను తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఫైనల్ గా మిల్కీబ్యూటీ లేకుండానే ఆ సాంగ్ పిక్చరైజ్ చేశారు.

బడ్జెట్ పెరిగిపోతుందనే కారణంతోనే తమన్ను తప్పించి, ప్లెయిన్ గా ఆ పాట తీశారంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. దీనిపై స్వయంగా "సవ్యసాచి" నిర్మాతలు స్పందించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, మోహన్, రవి. తమన్నను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరంగా చెప్పుకొచ్చారు.

"తమన్న విషయంలో రాజీ పడలేదు. కథలో ఆ పాట వచ్చే సిచ్యుయేషన్ లో బయట నుంచి ఓ అమ్మాయి వచ్చి డాన్స్ చేసేలా లేదు. ఆ సన్నివేశంలో బయట నుంచి వచ్చే హీరోయిన్ ఫిట్ అవ్వడం లేదు. తమన్నతో డిస్కషన్లు పూర్తయ్యాయి. అంతా ఓకే అన్నాం. కథ ప్రకారం వచ్చే ఆ రీమిక్స్ పాటలో మరో హీరోయిన్ ను తెస్తే ఫిట్ అవ్వదని డైరక్టర్ చెప్పడంతో తమన్నాను తీసుకోలేదు."

"సవ్యసాచి" సినిమా కథ కాలేజ్ లో ఓపెన్ అవుతుందని, స్టూడెంట్స్ మధ్య ఆ రీమిక్స్ పాట వస్తుందని తెలిపారు నిర్మాతలు. అలాంటి సందర్భంలో సడెన్ గా మరో హీరోయిన్ కనిపిస్తే బాగుండదని అంతా ఫీలయ్యామని అంటున్నారు.