సీతకి ఓపెనింగ్స్ రాలేదు ఎందుకు?

Why Teja and Bellamkonda's Sita got low openings?
Sunday, May 26, 2019 - 00:30

తేజ తీసిన "సీత" శుక్ర‌వారం విడుద‌లైంది. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించాడు. హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్. అన్నీ పేరున్న పేర్లే. ఐనా సినిమాకి ఓపెనింగ్స్ స‌రిగ్గా రాలేదు. ఎందుకు? యాక్ష‌న్ సినిమాల‌తో మాస్‌లో మంచి గ్రిప్ తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల‌కి మంచి ఓపెనింగ్స్ ఉంటాయ‌ని చెపుతుంటారు. కానీ ఈ సినిమాకి మ‌రీ ఆర్డీన‌రీగా వ‌చ్చాయి. క్రిటిక్స్ నుంచి స‌రిగ్గా రేటింగ్స్ రాలేద‌నేది ప‌క్క‌న పెడితే.. ఓపెనింగ్స్ ఐతే ఉండాలి క‌దా. 

తేజ ఇంత‌కుముందు "నేనే రాజు నేనే మంత్రి" అనే హిట్ సినిమా తీసి ఉన్నాడు. ఇక కాజ‌ల్‌కి యూత్‌లో అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంది. మ‌రి ఇన్ని ఫ్యాక్ట‌ర్స్ క‌లిసినా ఎందుకు జ‌నం రాలేదు?

అంద‌రూ ఎన్నిక‌ల ఫలితాల మూడ్‌లో ఉన్నార‌నేది ఒక వెర్స‌న్‌. రెండోది ఈ సినిమాకి పెద్ద‌గా బ‌జ్ క్రియేట్ కాలేదు. మేక‌ర్స్ పెద్ద‌గా ప్ర‌చారం చేసింది లేదు. విడుద‌లైన త‌ర్వాత యూనానిమ‌స్‌గా టాక్ బ్యాడ్‌గా వ‌చ్చింది. దాంతో శ‌నివారం కూడా పిక‌ప్ కాలేదు.