ఆదికి 2020 టర్న్ ఇస్తుందా?

Will Adhi get a hit?
Monday, December 30, 2019 - 14:00

"ప్రేమకావాలి" అంటూ పదేళ్ల కిందట మనముందుకొచ్చాడు ఆది సాయికుమార్. అప్పట్నుంచి ఓ మంచి హిట్ కావాలంటూ అభ్యర్థిస్తూనే ఉన్నాడు. కానీ ప్రేక్షకులు అతడికి ఆ సక్సెస్ అందివ్వలేదు. ఈ పదేళ్లలో ఎన్నో జానర్స్ ట్రై చేశాడు, ఇంకెన్నో వేషాలు వేశాడు. కానీ ఏది ఆదికి కలిసికాలేదు. అందుకే సరికొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు ఈ సాయికుమార్ వారసుడు.

వచ్చే ఏడాదికి శశి అనే సినిమాను రెడీ చేస్తున్నాడు ఆది సాయికుమార్. ఇందులో డిఫరెంట్ మేకోవర్ తో కనిపిస్తున్నాడు. ఈ మూవీతో పాటు కొత్తగా మరో థ్రిల్లర్ ఎనౌన్స్ చేశాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇందులో డాక్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో 2020ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తానంటున్నాడు ఆది.

2019 ఆది సాయికుమార్ కు బొత్తిగా కలిసిరాలేదు. అతడు చేసిన బుర్రకథ, ప్రేక్షకుల బుర్ర తినిపడేసింది. ఆ తర్వాత జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ తో "జోడీ" కట్టినా అది కూడా వర్కవుట్ కాలేదు. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ చూపించినా జనాలు యాక్సెప్ట్ చేయలేదు. ఇలా ఫ్లాపులతో 2019ను ముగించిన ఆది, కొత్త ఏడాదిలోకి కోటి ఆశలతో అడుగుపెడుతున్నాడు.