హ‌రికృష్ణ మ‌ర‌ణం.. అర‌వింద స‌మేత ఆల‌స్య‌మా?

Will Aravindha Sametha be delayed due to Harikrishna's sudden demise?
Wednesday, August 29, 2018 - 23:45

నంద‌మూరి హ‌రికృష్ణ అకాల మ‌ర‌ణంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా విడుద‌ల తేదీ మారుతుందా? ఇదే ప్ర‌శ్న అభిమానుల మ‌దిలో మొద‌లుతోంది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిస్తోన్న "అర‌వింద స‌మేత" ఈ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఐతే త‌న తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణంతో.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి దూరంగా ఉండ‌క త‌ప్ప‌దు. 

మ‌రి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ నిర్ణ‌యం తీసుకుంటాడు?

త్రివిక్ర‌మ్ ప్లాన్ ప్ర‌కారం ద‌స‌రా విడుద‌ల తేదీలో మార్పు ఉండ‌క‌పోవ‌చ్చు. ఆయ‌న ఈ సినిమాని చాలా వేగంగా, ప‌క్కా ప్లానింగ్‌తో తీస్తున్నారు. ఇప్ప‌టికే చాలా భాగం పూర్త‌యింది. సెప్టెంబ‌ర్ నెల మొత్తం వ‌ర్క్ చేస్తే సినిమా మొత్తం కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు, ఎడిటింగ్‌, ఎడిట్ అయిన భాగానికి బీజీ స్కోర్ ఇలా అన్ని ఏక‌కాలంలో జ‌రుగుతున్నాయి. సో... వ‌ర్క్ విష‌యంలో ఏ స‌మ‌స్యా రాదు. ఐతే ఎన్టీఆర్ త‌న తండ్రి మ‌ర‌ణం బాధ‌ని దిగ‌మింగుకొని షూటింగ్‌లో పాల్గొనాలి. ప్ర‌స్తుతానికైతే విడుద‌ల తేదీలో ఎలాంటి మార్పు ఉండే అవ‌కాశం లేదు.