బోయ‌పాటి ఆ హీరోతో వెళ్తాడా?

Will Boyapati go with this hero?
Tuesday, May 14, 2019 - 17:30

బోయపాటి శ్రీనుకి నందమూరి బాలకృష్ణ పెద్ద ఝలకే ఇచ్చాడు. కథ రెడీ చేసుకొని, షూటింగ్ కి వెళామనుకుంటున్న తరుణంలో...తూచ్ నీ డైరక్షన్లో చేయడం లేదని బాలయ్య చెప్పాడు. దాంతో షాక్ తిన్న బోయపాటి సైలెంటయ్యాడు.

తాజా సమాచారం ప్రకారం బోయపాటి ఇపుడు ఒక యువ హీరోతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికిపుడు అతనికి మిడిల్ రేంజ్ హీరోల డేట్స్ దొరికేలా లేవు. పెద్ద హీరోలెవ్వరూ ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో RX100 సినిమాతో పేరు తెచ్చుకున్న కార్తీకేయ హీరోగా మూవీ చేస్తే ఎలా ఉంటుందని థింకుతున్నాడట.

ఇంతకుముందు బెల్లంకొండ శ్రీనివాస్ వంటి యువ హీరోతో చేసిన అనుభవం ఉంది బోయపాటికి. ఐతే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాని కూడా 40 కోట్లకి పైగా ఖర్చు పెట్టి తీశాడు బోయపాటి. కానీ కార్తీకేయతో అంత బడ్జెట్ పెట్టేందుకు ఏ నిర్మాత ముందుకు రాడు. మరి ఎలా? అదే ఇపుడు బోయపాటి టెన్సన్. ఆయన ముందు లేదు వేరే ఆప్పన్.