శర్వానంద్ అయినా లాక్ అవుతాడా?

Will Maha Samudram take off with Sharwanand?
Wednesday, December 25, 2019 - 22:30

మహాసముద్రం.. ఈ టైటిల్ కు తగ్గట్టుగానే ఉంది ఈ సినిమా ప్రహసనం కూడా. గమ్యం ఎక్కడో తెలియకుండా సాగుతోంది ఈ సినిమా ప్రస్థానం. ముందు రవితేజతో అనుకున్నారు. ఆయన తప్పుకున్నాడు. రీసెంట్ గా నాగచైతన్య పేరు వినిపించింది. ఇక ఆల్ మోస్ట్ ఫిక్స్ అనుకున్న టైమ్ లో కాల్షీట్లు లేవన్నాడట చైతూ. ఇప్పుడు కొత్తగా శర్వానంద్ పేరు వినిపిస్తోంది.

అవును.. మహాసముద్రం ప్రాజెక్టును శర్వానంద్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడట దర్శకుడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్100తో సూపర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు, అప్పట్నుంచి ఇదే కథ పట్టుకొని పట్టు వదలని విక్రమార్కుడిలా హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. జెమినీ కిరణ్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాడు కానీ హీరో మాత్రం సెట్ అవ్వడం లేదు.

చూస్తుంటే.. ఈసారి శర్వానంద్ లాక్ అయ్యేట్టు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ రెండూ కంప్లీట్ అయ్యేసరికి జూన్ వస్తుంది. అప్పుడు కావాలంటే బల్క్ లో కాల్షీట్లు ఇస్తానంటున్నాడు శర్వ. అప్పటివరకు ఆగితే నాగచైతన్య కూడా ఫ్రీ అవుతాడు. మరి శర్వానంద్ తోనే లాక్ అవుతాడా ఈ దర్శకుడు.