ప్రభాస్‌ మీడియా మీట్‌ ఉంటుందా?

Will Prabhas meet the media now?
Friday, September 6, 2019 - 11:30

రిలీజ్‌కి ముందు ప్రభాస్‌ ఇచ్చిన ఇంటర్వ్యూల హంగామా, చేసిన ప్రమోషన్‌ చూసి ఇండస్ట్రీ అంతా ముక్కు మీద వేలేసుకొంది. ఏంటి..మన ప్రభాసేనా అని ఆశ్చర్యపోయింది. సిగ్గుకి కటౌట్‌లా ఉండే ప్రభాస్ అంత రెచ్చిపోయే ప్రమోషన్‌ ఇవ్వడం ఏంటో అని స్టన్‌ అయింది సినీజనం. ప్రభాస్‌ భజన బ్యాచ్‌ దాన్నో గొప్ప కార్యంగగా చెప్పుకున్నారు.. కానీ సినిమా రంగంలో ఎన్నో చూసిన వారు మాత్రం దాల్‌ మే కుచ్‌ కాలా అని అపుడే  డౌట్‌ పడ్డారు. చివరికి వారి అనుమానమే నిజం అని ప్రూవ్‌ అయింది. పోస్టర్స్‌పై గ్రాస్‌ ఫిగర్ల గురించి పక్కన పెడుదాం.... ఇపుడు ఫైనల్‌గా అందరికీ క్లారిటీ వచ్చింది ఈ సినిమా ఫ్లాప్‌ అని. 

మొదటి వారం తర్వాత సాహో పరిస్థితి ఏంటంటే... హిందీలో తప్ప అన్ని భాషల్లో ఫ్లాప్‌. గుడ్డిలో మెల్ల ఏంటంటే.. మొదటి రోజు మొదటి ఆట చూసి... నిర్మాతలకి 150 కోట్లు పోతాయామో అంచనా వేశారు. కానీ మొదటి వారం తర్వాత ఆ లాస్‌ శాతం తగ్గింది. లాస్‌ గ్యారెంటీ... శాతంలో కోత. తెలుగునాట ఎంత లేదన్నా 50 కోట్లు లాస్‌. సీడెడ్‌లో కొన్నవారికి 13 కోట్లు పోతున్నాయి. ఇది రియల్‌ సీన్‌.

తమిళంలో, మలయాళంలో ఆల్రెడీ అట్టర్‌ఫ్లాప్‌ అయిన సాహో తెలుగునాట కూడా లాస్‌ వెంచర్‌గానే మిగిలింది. మరి ఇపుడు ప్రభాస్‌ మీడియాని మీట్‌ అవుతాడా? నాలుగు రాజుల పాటు టూర్‌ వెళ్లిన ప్రభాస్‌ తాజాగా హైదరాబాద్‌ వచ్చాడు. రాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకి థ్యాంక్స్‌ చెప్పాడు. త్వరలోనే మీడియాని కలిసే చాన్స్‌ ఉందట. నిజంగానే ఉంటుందా లేదా అనేది చూడాలి.