శ్రీముఖి ఎంతవరకు లాగగలదు?

Will Sreemukhi shine in Bigg Boss 3
Thursday, August 1, 2019 - 12:45

హేమ ఆంటీ ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయింది. అక్కా అక్కా అంటూ బొక్క పెట్టారంటూ హేమ మీడియా ముందు బావురుమంది. దాంతో ఇపుడు బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన మంచి గ్లామర్ ఫేస్ ఎవరంటే శ్రీముఖి అనే చెప్పాలి. ఇక శ్రీముఖి గ్లామర్ మీదే ఈ షో రన్ కావాలి. మరి ఈ యాంకర్ చివరి వరకు ఉండగలదా?

పటాస్ వంటి ప్రోగ్రామ్స్ ని  వదులుకొని మరీ ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. అంతేకాదు, ఈ షో కోసమే చాలా బరువు తగ్గింది. ఇంత కష్టపడి, అన్ని షోలు వదులుకుందంటే ఇక్కడ అంతకన్నా ఎక్కువ గిట్టుబాటు కావాలి. ఎన్ని రోజులు ఆమె షోలో ఉంటే అంత రెమ్యునరేషన్ వస్తుంది. పొరపాటున మూడో రౌండ్ కో, నాలుగో రౌండ్ కో  ఎలిమినేట్ అయిందంటే ఆమె కష్టం అంతా వృధానే.

మరి లాంగ్ టైమ్ వరకు ఈ భామ తన టెక్కులతో, ట్రిక్కులతో మురిపించగలదా, బండి లాగగలదా?