కటింగ్ కి మనోళ్లు ఒప్పుకుంటారా?

Will Tollywood stars agree for a cut in remuneration?
Monday, April 27, 2020 - 16:15

లాక్డౌన్ ముగిసిన తర్వాత షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో తెలీదు. కానీ ఇండస్ట్రీ బతికి బట్టకట్టాలంటే ఏమి చెయ్యాలా అని మలయాళ నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే చర్చ మొదలు పెట్టారు. తాము ఇప్పుడు తీసుకుంటున్న పారితోషికాల్లో సగం మాత్రమే పుచ్చుకోవాలని ప్రాథమికంగా డిసైడ్ అయ్యారని టాక్. అంటే మళ్ళీ ఇండస్ట్రీ గాడిలో పడేవరకు, పరిస్థితులు చక్కబడేవరకు తాము తీసుకునే మొత్తంలో 50 పర్సెంట్ కటింగ్ కి అందరూ రెడీ అవుతున్నారు.

ఇలాంటిది మన తెలుగులో సాధ్యమవుతుందా?

మలయాళ చిత్రసీమ చిన్నది. మన దగ్గర ఒక్కో పెద్ద హీరో పారితోషికం 30 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంది. పెద్ద దర్శకులు 15 నుంచి 20 కోట్ల వరకు తీసుకుంటున్నారు. మరి మనవాళ్ళు ఇలాంటి కోతకు ఒప్పుకుంటారా? అసలు ఒకే చెప్పారు. ఎంత దొరికితే అంతే లాగాలనుకునే హీరోలు, దర్శకులు ఇలాంటి ప్రతిపాదనలకు ససేమిరా ఒప్పుకోరు.

ఇప్పటికే షూటింగ్ లో ఉన్న పెద్ద సినిమాల వ్యాపారం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలకి సంబంధించి రెమ్యూనరేషన్ లావాదేవీలు ఇప్పటికే పూర్తి అయి ఉంటాయి. ఆ తర్వాత ఏమి చేస్తారు అనేది చూడాలి.