పోసానికి ఏ ప‌ద‌వి ఇస్తారో?

Will Y S Jagan give a plum post to Posani Krishna Murali?
Sunday, May 26, 2019 - 00:15

పోసాని కృష్ణ ముర‌ళి, పృథ్వీ వంటి టాలీవుడ్ సెల‌బ్రిటీలు చాలా కాలం నుంచి వైకాపాకి మ‌ద్ద‌తుదారులుగా ఉన్నారు. అస్స‌లు వైకాపా న్యూస్‌ని కూడా ఎవ‌రూ క‌వ‌ర్ చేయ‌ని ద‌శ‌లోనూ పోసాని గ‌ట్టిగా జ‌గ‌న్‌కి సపోర్ట్‌గా నిలిచారు. అనేక‌సార్లు చంద్ర‌బాబునాయుడిని త‌న మాట‌ల బ‌కెట్ల‌తో ఉతికి ఆరేశారు. 

అంత స‌పోర్ట్‌గా నిలిచిన పోసానికి ఏ ప‌ద‌వి రానుంద‌నేది ఇపుడు టాలీవుడ్‌లో డిస్క‌ష‌న్ పాయింట్‌. పోసాని కృష్ణ ముర‌ళి...టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌. క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దాదాపు ప్ర‌తి పెద్ద సినిమాలోనూ న‌టిస్తున్నారు. న‌టుడిగా వెల్ ఆఫ్‌. ఐతే ప‌ద‌వి అనేది ఒక గౌర‌వం క‌దా. అది వ‌స్తే కాద‌నుకోలేరు పోసాని.

ఐతే పోసాని మాత్రం తాను ప‌ద‌వి ఆశించ‌డం లేదు అంటున్నారు. జ‌గ‌న్‌ని న‌మ్మాను కాబ‌ట్టే అండ‌గా నిలిచాను త‌ప్ప ప‌ద‌వి కోసం కాద‌ని చెపుతున్నారు. ఐతే ఫిల్మ్ డెవ‌ల్‌మెంట్ కార్పోరేష‌న్ కి ఛైర్మ‌న్ ప‌ద‌వి ఐనా ద‌క్కే అవ‌కాశం ఉంద‌నేది టాక్‌.