రోజా లేక‌పోతే కిక్కే లేద‌ట‌

Without Roja there is no entertainment, say TDP leaders
Wednesday, December 6, 2017 - 20:45

రోజా లేక‌పోతే అస్స‌లు కిక్ లేద‌బ్బా! ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన మంత్ర‌లు, ఎమ్మెల్యేలు.

న‌టి రోజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్‌బ్రాండ్ నేత‌. ఆమె నోరు విప్పిందంటే ఎదుటి ప‌క్షం నేత‌లు మాట‌లు వెతుక్కోవాలి. ఆమె పొలిటిక‌ల్ పంచ్ డైలాగ్‌ల‌ బుల్లెట్‌ల‌ను త‌ట్టుకోవ‌డం ఎంత‌టి పురుష‌పుంగవుల‌కైనా క‌ష్ట‌మే. ఆమె నిర్మోహ‌మాటంగా మాట్లాడుతుంది. అవి బూతుల‌ని ఆడిపోసుకుంటారు అధికార ప‌క్ష నేత‌లు. కానీ నావి క‌ర్ణ‌క‌ఠోర స‌త్యాలు అంటూ ఉంటుంది రోజా.

ఇటీవ‌ల ముగిసిన ఆంధ్ర అసెంబ్లీ స‌మావేశాల‌ను వైఎస్పార్ పార్టీ బ‌హిష్క‌రించింది. దాంతో రోజా అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌లేదు. ఆమె లేక‌పోవ‌డంతో అసెంబ్లీ స‌మావేశాల్లో కిక్ లేద‌నిపించింద‌ని మంత్రి సోమిరెడ్డి మీడియాకి చెప్పాడు. ఇత‌ర తెలుగుదేశం పార్టీ నేత‌ల మాట అదే. ఆమె ఉంటే అసెంబ్లీలో చాలా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంద‌ట‌. రోజా జ‌బ‌ర్‌ద‌స్త్ డైలాగ్‌లకి (అదే..అదే ఆమె నిజాల‌కి) తెలుగుదేశం నేత‌లు బాగా అల‌వాటు ప‌డ్డ‌ట్లు ఉన్నారు. మొత్తానికి అసెంబ్లీ స‌మావేశాలు జ‌బ‌ర్‌ద‌స్త్ షోలా మారాయి అని పాతత‌రం వాళ్లు గొణుక్కుంటున్నారు.