నోటాపై రైట‌ర్ ఫిర్యాదు

Writer Shashank Vennelakanti files case on NOTA
Monday, September 17, 2018 - 23:30

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘నోటా’ వ‌చ్చే నెల మొద‌టి వారంలో విడుద‌ల కానుంది. ఇంకా అధికారికంగా డేట్ ప్ర‌క‌టించ‌లేదు కానీ దాన్నే విడుద‌ల తేదీగా ఫిక్స్ చేస్తార‌నేది లేటెస్ట్ టాక్‌. ఐతే ఈ సినిమాని విడుద‌ల చేయాలంటే ముందుగా నాకు క్రెడిట్‌, మ‌నీ ఇవ్వాలంటున్నాడు తెలుగు రైట‌ర్‌. 

నోటాని బేసిక‌ల్‌గా త‌మిళంలో తీశాడు త‌మిళ ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్. తెలుగు వెర్స‌న్ కోసమ‌ని తెలుగు ర‌చ‌యిత శ‌శాంక్ వెన్నెల‌కంటితో కీల‌క‌మైన డైలాగ్‌లు రాయించుకున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే తీరా సినిమా విడుద‌ల టైమ్‌కి త‌న పేరుని క్రెడిట్స్ నుంచి తొలిగించారని శశాంక్‌ వెన్నలకంటి పోలీసులను ఆశ్రయించాడు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.

త‌న‌కి డ‌బ్బులతో పాటు పేరు కూడా కావాల‌ని అంటున్నాడు. ట్ర‌యిల‌ర్లో మ‌నం చూసిన డైలాగ్‌లు శశాంక్ రాసిన‌వేన‌ట‌. ఐతే ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ ఇపుడు క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వమ‌ని మొత్తంగా త‌న పేరే వేసుకుంటున్నాడు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్‌ల‌లో త‌న పేరు లేక‌పోవ‌డంతో ఆయ‌న కేసు వేశాడు నిర్మాత జ్ఞాన‌వేల్ రాజాపై.

గీత గోవిందం వంటి సెన్సేష‌నల్ హిట్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మూవీ ఇది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన నోటాపై కూడా అంచ‌నాలు పెరుగుతున్నాయి.