జరీనా ఖాన్‌ సెకండాఫ్‌లో వస్తుందట

Zarine Khan opposite Gopichand
Saturday, September 14, 2019 - 18:00

గోపీచంద్ హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'చాణక్య'. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా  తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాతో బాలీవుడ్‌ భామ జరీన్‌ ఖాన్‌ పరిచయం అవుతోంది. సల్మాన్‌ఖాన్‌ వంటి బడా హీరోల సరసన జరీన్‌ నటించింది. ఇపుడు అక్కడ ఆఫర్లు తగ్గాయి. దాంతో టాలీవుడ్‌ బాట పట్టింది.

ఆమె పాత్ర సెకండాఫ్‌లో వస్తుందట. మెయిన్‌ హీరోయిన్‌గా మెహ్రీన్‌ ఉంటుంది. "మెహ్రీన్ తో నా లవ్ ట్రాక్ సీన్స్ యూత్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక జరీన్ ఖాన్ సెకండాఫ్ లో వస్తుంది. ఆమెది. చాలా ముఖ్యమైన పాత్ర," అని గోపిచంద్‌ తెలిపాడు. గోపిచంద్‌ ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాకి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించాడు.